అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియెనల్ మెస్సీ అదిరిపోయే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫ్రాన్స్ ఫుట్బాల్ టోర్నీ లీగ్–1లో ఆడేందుకుగాను రెండు సంవత్సరాలకు మెస్సీకి దాదాపు ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) రూ. 610 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తంది. ఈ ఒప్పందానికి సంబంధించి అధికారిక ప్రకటన నేడు వెలువడనుంది. కాగా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మెస్సీతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునేందుకు సుముఖంగా లేమని బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆకస్మిక ప్రకటన నేపథ్యంలో అభిమానులు షాక్కు గురయ్యారు. ప్రతిష్టాత్మక కోపా అమెరికా 2021లో అర్జెంటీనా విజయం తర్వాత సెలవుల్లో ఉన్న మెస్సీ.. క్లబ్లో చేరిన మరుసటి రోజే ఈ మేరకు ప్రకటన జారీకావడం గమనార్హం. మెస్సీతో బార్సిలోనా క్లబ్.. కాంట్రాక్ట్ రెన్యువల్ ఉండొచ్చని భావించగా ఈ హఠాత్పరిణామంతో ఫ్యాన్స్ విస్మయానికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: పూలతో మాస్క్..పెళ్లిలో వధువువరులు ఫ్లాట్ అవ్వాల్సిందే..