లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ వేదిక కూడా మార్పు చేసినట్లు లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు రమన్ రహేజా తెలిపారు. ఒమన్‌లో కాకుండా భారత్‌లోనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తొలి టోర్నీమెంట్ భారత్‌లో నిర్వహించగా, ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ఆదరణ చూరగొన్నది. ఈ సారి కూడా వంద మందికి పైగా లెజెండ్స్‌కు ఈ టోర్నీలో పాల్గొంటున్నారని తెలిపారు. తొమ్మిది దేశాలకు చెందిన క్రికెటర్లు వివిధ టీమ్‌ల ద్వారా పోటీపడుతున్నారని రమన్ రహేజా వివరించారు.
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), మోంటీ పనేసర్ (ఇంగ్లండ్), నమన్ ఓజా (ఇండియా), స్టార్ట్ బిన్నీ (ఇండియా), ప్రవీణ్ తంబీ (ఇండియా), ఎస్.బద్రీనాథ్ (ఇండియా), అస్ఘర్ అఫ్గన్ (అఫ్గనిస్తాన్), బ్రెట్ లీ (ఆస్ట్రేలియా), లియామ్ ప్లంకెట్ (ఇంగ్లండ్), జోగిందర్ శర్మ (ఇండియా), అల్బీ మోర్కెల్ (సౌతాఫ్రికా), జాంటీ రోడ్స్ (సౌతాఫ్రికా), అజంతా మెండిస్ (శ్రీలంక), దిల్హర ఫెర్నాండో (శ్రీలంక), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్), ఎస్.శ్రీశాంత్ (ఇండియా), మిస్బా ఉల్ హక్ (పాకిస్తాన్), కెవిన్ ఒ బ్రియెన్ (ఐర్లాండ్), బ్రెట్ లీ (ఆస్ట్రేలియా), షోయబ్ అక్తర్ (పాకిస్తాన్), కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్), తిలక్‌రత్నె దిల్షాన్ (శ్రీలంక), మొహమ్మద్ కైఫ్ (ఇండియా), సనత్ జయసూర్య (శ్రీలంక), మొహమ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్) తదితర దిగ్గర క్రీడాకారులు లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో పాల్గొంటున్నట్లు సమ్మతి తెలియజేసినట్లు రమన్ రహేజా తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.