Tuesday, November 26, 2024

లెజెండరీ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్… అర్జున పిచ్చయ్య ఇక లేరు..

బాల్‌ బాడ్మింటన్‌ తొలితరం క్రీడాకారులు అర్జున పిచ్యయ్య ఇక లేరు. ఇటీవలనే 104వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న పిచ్చయ్య అస్వస్థతతో ఆదివారం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో జంబలమడక నాగమ్మ పున్నయ్య దంపతులకు మూడవ సంతానంగా పిచ్చయ్య జన్మించారు. 10వతరగతి వరకు మచిలిపట్నంలోనే విద్యాభ్యాసం పూర్తిచేసిన పిచ్చయ్య బాల్‌ బ్యాడ్మింటన్‌పై ఉన్న మక్కువతో ఏకలవ్యుడిలా సాధన చేసి ఆటపై మంచి పట్టు సాధించారు.

1935-36లో నర్సారావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో విజేతగా నిలిచారు. 1947-48లో గుడివాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో కూడా విజేతగా నిలిచి, 1950దశకంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 1954-55లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొన్న పిచ్చయ్య జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం మద్రాసు పాండిచ్చేరిలో 1956-57లో జాతీయ పోటీల్లో జట్టునుగెలిపించి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నికయ్యారు. 15 జాతీయ స్థాయి పోటీల్లో కెప్టెన్‌గా ముందుండి నడిపించిన అర్జున పిచ్చయ్య 9 ఛాంపియన్‌షిప్‌లను గెలిపించారు. పిచ్చయ్యకు భారత ప్రభుత్వం 1970లో అర్జున అవార్డును ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement