ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల జరిగే కీలక మ్యాచ్‌లో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా, మరో నాలుగు రోజుల్లో (మార్చి 15 నుంచి) నాకౌట్ మ్యాచ్ లు ప్రారంభం కానుండగా.. యూపీ వారియర్స్ కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
గత సీజన్ ఫైనలిస్టులు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకోగా, నాకౌట్ మ్యాచ్‌లకు మరో బెర్త్ ఖాళీగా ఉంది. కాగా, పాయింట్స్ టేబుల్‌లోని మూడవ స్థానం కోసం యూపీతో పాటు ఆర్సీబీ జట్టు కూగా పోటీ పడుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే యూపీ జట్టు పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాలకు చేరుకుని నాకౌట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. మరోవైపు గుజరాత్ కేవలం రెండు పాయింట్లతో ప్లేఆఫ్ ఆశలు కోల్పోయింది.
పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ముంబై, ఢిల్లీ మహిళల జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. ఇక ఆర్సీబీ, యూపీ జట్లు 6 పాయింట్లతో 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో యూపీకి ఇదే చివరి మ్యాచ్, ప్లే ఆఫ్స్‌లో సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ప్రస్తుతం ఏడు మ్యాచ్‌లు ఆడిన యూపీ వారియర్స్ మూడు గెలిచి ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.