Tuesday, November 26, 2024

Sports | ఫైనల్‌కు లక్ష్యసేన్‌.. సెమీస్‌లో ఓడిన సింధు

కెనడా ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌ లక్ష్యసేన్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత తొలి బీడబ్ల్యూఎఫ్‌ టోర్నీలో లక్ష్యసేన్‌ ఫైనల్‌ చేరాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో లక్ష్యసేన్‌ 21-17, 21-14తే జపాన్‌కు చెందిన స్టార్‌ షట్లర్‌, నాలుగో సీడ్‌ కెంటా నిషిమోటాపై వరుస గేమ్స్‌లో అద్భుత విజయం సాధించాడు. 44నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో లక్ష్యసేన్‌ వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గెలుపొందాడు.

- Advertisement -

దీంతో నిషిమోటాపై తన రికార్డును 2-1కు పెంచుకున్నాడు. ఫైనల్‌లో లక్ష్యసేన్‌ చైనాకు చెందిన లీ షిఫెంగ్‌తో తలపడనున్నాడు. మరోవైపు భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ సెమీఫైనల్‌లో ఓడిపోయింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో జపాన్‌కు చెందిన అకానె యమగూచి చేతిలో 14-21, 15-21తో వరుస గేమ్స్‌లో సింధు పరాజయం పాలైంది. సింధుపై యమగూచి 11వ విజయాన్ని నమోదు చేసింది.

గతంలో యమగూచిపై భారత షట్లర్‌ పీవీ సింధు 14 మ్యాచ్‌లు గెలిచిన రికార్డ్‌ ఉంది. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ తర్వాత సింధు గాయపడగా… త్వరగా కోలుకుని బ్యాడ్మింటన్‌ కోర్టులో అడుగుపెట్టింది. తొమ్మిది టోర్నమెంట్లు ఆడిన సింధు… 5 టోర్నీలో మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగింది. సింధు ఈ ఏడాది 26 మ్యాచ్‌ల ఆడగా, 14 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అయితే ఈ ఏడాది తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న సింధు గాయం నుంచి కోలుకున్నాక ఫామ్‌లో లేక ఇబ్బందిపడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement