Saturday, July 6, 2024

Lakshya Sen | కెనడా ఓపెన్‌ నుంచి తప్పుకున్న లక్ష్యసేన్‌

భారత స్టార్‌ యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఒలింపిక్స్‌కి ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది కెనడా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన లక్ష్యసేన్‌ ఈసారి ఈ టోర్నీ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సేన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సేన్‌ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. అందుకే బుధవారం నుంచి ప్రారంభమైన కెనడా ఓపెన్‌-2024కు డిఫెండింగ్‌ చాంపియన్‌ లక్ష్యసేన్‌ దూరమయ్యాడు. మరోవైపు పురుషుల విభాగం సింగిల్స్‌లో భారత్‌ తరఫున మరో యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ పాల్గొంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement