న్యూఢిల్లి : టాప్ ఇండియన్ షట్లర్స్ పీవీ సింధు, కిదాంబీ శ్రీకాంత్‌లు.. అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నారు. కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఇరువురు రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. వరుస సెట్స్‌లో గెలుపొందిన ఇరువురు ఆటగాళ్లు.. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. ఒలింపిక్ క్రీడల్లో రెండు సార్లు పతకాలు సాధించిన తెలుగు తేజం పీవీ సింధు.. సింగిల్స్ విభాగంలో.. అమెరికాకు చెందిన లారెన్ లామ్‌ను 21-15, 21-14 వరుస సెట్స్‌లో మట్టి కరిపించింది. ఇక కిదాంబి శ్రీకాంత్ కూడా అదే జోరు ప్రదర్శించాడు. వరల్డ్ 35 ఆటగాడు, మలేషియాకు చెందిన డారెన్ లీవ్‌ను 22-20, 21-11 పాయింట్ల తేడాతో రెండు వరుస సెట్స్‌లో విజయం సాధించాడు. పాల్మా స్టేడియంగా వేదికగా తెలుగు తేజాలు ఈ ఘనత సాధించారు. మూడో సీడ్ క్రీడాకారిణి అయిన.. పీవీ సింధు, ఇటీవలే స్విస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన క్రీడాకారిణి, వరల్డ్ ఛాంపియన్ షిప్ సిలర్ పతక విజేత అయా ఓ్హరీతో తలపడనుంది. అదేవిధంగా ఐదో సీడ్ క్రీడాకారుడైన కిదాంబి శ్రీకాంత్.. ఇజ్రాయెల్‌కు చెందిన మిషా జిల్బర్మెన్‌తో తలపడుతాడు.
భారత్ పురుషుల డబుల్స్ విభాగంలో.. సాత్విక్ రాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి దయంతో పాటు ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిలాలు కూడా రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. సాత్విక్, చిరాగ్ జోడీ.. కొరియాకు చెందిన తై యంగ్ షిన్, వాంగ్ చాన్ జోడీని 21-16, 21-15 పాయింట్ల తేడాతో ఓడించింది. ఇక అర్జున్, ధ్రువ్ జోడీ.. కొరియా ఆటగాళ్లయిన బా దా కిమ్, హీ యంగ్ పార్క్‌ను ఓడించింది. మూడో సీడ్ జోడీ సాత్విక్, చిరాగ్‌లు.. సింగపూర్‌కు చెందిన హీ యంగ్ కై టెర్రీ, లో కీన్ హీన్‌తో తలపడనున్నారు. అర్జున్, ధ్రువ్ జోడీ.. రెండో రౌండ్లో ఇండోనేషియాకు చెందిన మహ్మద్ అహసన్, హెంద్రా సెటియావన్ జోడీతో తలపడుతారు. మహిళల సింగిల్స్ విభాగంలో.. శ్రీ క్రిష్ణ ప్రియా కుదరవల్లి.. రెండో సీడ్ క్రీడాకారిణి, కొరియన్ అన్ సియోంగ్ చేతిలో 5-21, 13-21 పాయింట్ల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. మంగళవారం.. వరల్డ్ ఛాంపియన్షిప్ బ్రాంజ్ పతకధారి.. లక్ష్యసేన్‌తో పాటు మాలవికా బన్సోడ్లు రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..