Thursday, September 12, 2024

David Miller | హిట్ట‌ర్‌ను కొట్టేసిన‌ కోల్‌క‌తా.. ఆ లీగ్‌లోనూ ట్రోఫీ సాధించేనా?

ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో చాంపియ‌న్‌గా నిలిచిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌రో లీగ్ టైటిల్‌పై క‌న్నేసింది. అమెరికా వేదిక‌గా జ‌రిగే మేజ‌ర్ లీగ్ క్రికెట్‌లోనూ ట్రోఫీ సాధించే దిశ‌గా కోల‌క‌తా ఫ్రాంచైజీ పావులు క‌దుపుతోంది. అందులో భాగంగానే ఎంఎల్‌సీ రెండో సీజ‌న్‌కు ముందు ప‌వ‌ర్ హిట్ట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్‌ను కేకేఆర్ సిస్ట‌ర్ ఫ్రాంచైజీ లాస్ ఏంజెల్స్ నైట్ రైడ‌ర్స్ కొనేసింది.

- Advertisement -

అయితే.. ఎంత మొత్తానికి అత‌డితో కాంట్రాక్ట్ కుదిరింద‌నే విష‌యం మాత్రం కేకేఆర్ వెల్ల‌డించ‌లేదు. తొలి సీజ‌న్‌లో మిల్ల‌ర్ టెక్సాస్ సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగాడు. ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ఓ రేంజ్‌లో ఆడాడు. అప్పుడే టోర్నీలో అడుగుపెట్టిన‌ గుజ‌రాత్ టైటాన్స్ విజేత‌గా నిల‌వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. హిట్ట‌ర్, విధ్వంసక ఇన్నింగ్స్‌ల‌కు కేరాఫ్ అయిన ఈ చిచ్చ‌ర‌పిడుగు త్వ‌ర‌లోనే లాస్ ఏంజెల్స్ నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుతో క‌లువ‌నున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement