లక్నో: ఐపీఎల్లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ , లక్నో జట్టు మెంటర్ గౌతం గంభీర్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ ఇద్దరూ నిన్న మైదానంలోనే గొడవ పడ్డారు. సోమవారం లక్నోతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆ టార్గెట్‌ను అందుకోలేకపోయింది. అయితే విక్టరీ తర్వాత ప్లేయర్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో.. కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ఇద్దరూ దూషించుకుంటున్న సమయంలో ఇరు జట్ల ప్లేయర్లు కూడా వారితోనే ఉండిపోయారు. ఆ ఇద్దర్నీ కేఎల్ రాహుల్ ఆపేందుకు ప్రయత్నించాడు. హ్యాండ్ షేకింగ్ సమయంలో లక్నో బ్యాటర్ కైల్ మేయర్స్వద్దకు కోహ్లీ వెళ్లి ఏదో మాట్లాడాడు. ఆ టైమ్‌లో గంభీర్ అక్కడకు వచ్చి మేయర్స్‌ను తీసుకువెళ్లాడు. ఆ సమయంలోనే కోహ్లీ, గంభీర్ మధ్య ఘర్షణ మొదలైంది. ఏదో చర్చించుకున్న కోహ్లీ, గంభీర్‌లు ఓ దశలో దూషించుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. గంభీర్ , కోహ్లీ లకు సర్దిచెప్పిన రాహుల్ ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటర్‌తో మాట్లాడాడు. మైదానంలోనే ఘర్షణ పడ్డ లక్నో మెంటర్ గంభీర్, ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు ఫైన్ వేశారు. ఇద్దరు ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఇద్దరూ అంగీకరించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఆర్టికల్ 2.21 ప్రకారం ఫైన్ వేశారు. లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement