భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వన్డే మ్యాచ్ లో నెలకొల్పిన అరుదైన రికార్డ్‌కి విరాట్ కోహ్లీ కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అహ్మదాబాద్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం నుంచి మూడు వన్డేలు జరగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకి తొలి వన్డే ప్రారంభంకానుంది. ఈ మేరకు ఇప్పటికే భారత్ జట్టుతో కలిసి అహ్మదాబాద్‌కి చేరుకున్న విరాట్ కోహ్లీ.. ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
భారత్ గడ్డపై వన్డేల్లో 5,000 పరుగుల మార్క్‌ని అందుకున్న ఏకైక క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డ్‌లో కొనసాగుతున్నాడు. అయితే.. సచిన్ 121 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ని చేరుకోగా.. విరాట్ కోహ్లీ 96 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 4,994 పరుగులు చేయడం గమనార్హం. ఆదివారం జరగబోయే తొలి వన్డేలో ఒకవేళ కోహ్లీ 6 పరుగులు చేయగలిగితే? భారత్ గడ్డపై వన్డేల్లో వేగంగా 5,000 పరుగుల మార్క్‌ని అందుకున్న క్రికెటర్‌గా ఘనత సాధించనున్నాడు.
జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. 2019, నవంబరు నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సెంచరీ కోసం కోహ్లీ నిరీక్షిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..