రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే వేదికగా 3000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
సీఎస్‌కే పేసర్ తుషార్ దేశ్‌పాండే వేసిన మూడో ఓవర్ తొలి బంతిని లాంగ్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాది కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ బంతిని తుషార్ దేశ్‌పాండే బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో వేయగా.. కోహ్లీ స్టేడియం పైకప్పు తాకేలా సిక్సర్ బాదాడు. ఈ సిక్సర్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ 3005 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉండగా.. రెండో స్థానంలో రోహిత్ శర్మ, మూడో స్థానంలో ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నారు. అయితే ఈ ఇద్దరూ విరాట్ కోహ్లీకి దరిదాపుల్లో కూడా లేరు.