Sunday, January 5, 2025

INDvsAFG | కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు.. తొలి భార‌త ఆట‌గాడిగా.. !

ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న టీ-20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవ్వాల ఇండోర్‌ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే, వ్యక్తిగత కారణాలతో మొదటి మ్యాచ్‌కు దూరమైన స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ రెండో మ్యాచ్‌కు జట్టుతో కలిశాడు. 14 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడనున్న కోహ్లీపై అందరి దృష్టి నెలకొంది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 35 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12 వేల పరుగుల మార్కును అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. టీ 20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ (14562) పేరిట ఉంది. ఈ జాబతాలో పాకిస్తాన్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ (12993), విండీస్‌ టీ20 స్పెషలిస్ట్‌ కీరన్‌ పోలార్డ్‌ (12430) గేల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement