శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే బయోబబుల్‌ను వీడిన కోహ్లీ శ్రీలంకతో జరిగే పొట్టి సిరీస్‌తోపాటు విండీస్‌తో జరిగే మూడో టీ20కి దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశం లభించనుంది. కోహ్లీతోపాటు దీపక్ చాహర్, భువనేశ్వర్, చాహల్, పంత్‌లకు ఆదివారం జరిగే మూడో టీ20 నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. మరో వారంరోజుల వ్యవధిలో శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కాగా టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్న కోహ్లీ శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు. కాగా రెండు టెస్టుల సిరీస్‌లోని తొలి టెస్టు మార్చి 4నుంచి జరగనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..