కుడి చేతి వాటం బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ మళ్లి ఫామ్‌లోకి రావడంపై తాను చాలా ఆశాజనకంగా ఉన్నానని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్, సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ సభ్యుడు సబా కరీమ్ అన్నారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌కు భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌ను ఎంపిక చేయాలనే సెలక్టర్ల నిర్ణయాన్ని మాజీ జాతీయ సెలెక్టర్ సబాకరీమ్ సమర్ధించారు. ”భారత టెస్టు జట్టుకు కొత్త వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అయితే ఓపెనర్ స్నాయువు గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో భారత ఎ కెప్టెన్ ప్రియాంక్ పంచల్‌ను బిసిసిఐ ఎంపిక చేయగా, సెలెక్టర్లు రాహుల్‌ను మూడు టెస్టుల సిరీస్‌కు విరాట్ కోహ్లికి స్టాండ్ ఇన్ డిప్యూటిగా ఎంపిక చేశారు.
దక్షిణాఫ్రికాతో వన్గేలకు ఎంపిక చేసేందుకు తాను అందుబాటులో ఉన్నానని రోహిత్ శర్మతో విభేధాలు ఉన్నాయనే పుకార్లను విరాట్ కోహ్లి కొట్టిపారేశాడు అన్న విషయాన్ని సబాకరీం గుర్తు చేశారు.