న్యూజిల్యాండ్ – ఐపిఎల్ లో గుజరాత్ టైటన్స్ తరుపున ఆడుతూ మైదానంలో తీవ్రంగా గాయపడిన న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ మోకాలికి సర్జరీ చేయవలసి ఉందని వైద్యులు వెల్లడించారు.. ఇప్పటికే గుజరాత్ జట్టు నుంచి వైతొలిగి స్వదేశానికి చేరుకున్నవిలియమ్స్ కు అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించారు.. కుడిమోకాలికి సర్జరీ చేయించుకోవాలని సూచించారు.. దీంతో త్వరలో కేన్ కు ఆపరేషన్ చేయనున్నారు..ఇదే విషయాన్ని విలియమ్స్ ఒక ప్రకటన ద్వారా తెలిపాడు. ‘న్యూజిలాండ్ క్రికెట్, గుజరాత్ టైటన్స్ ఫ్రాంఛైజీ నుంచి గత కొన్ని రోజులుగా నాకు చాలా మద్దతు లభించింది. ఫీల్డింగ్ చేస్తూ అలా గాయపడడం ఎవరికైనా నిరాశకు గురి చేస్తుంది. అయితే.. ఇప్పుడు నా ఫోకస్ అంతా సర్జరీ మీద, రీహాబిలిటేషన్‌లో ఉండడం మీద మాత్రమే ఉంది. నేను కోలుకునేందుకు కొంత సమయం పట్టనుంది. వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను’ అని పేర్కొన్నాడు.. గాయం నుంచి కోలుకునేందుకు దీర్ఘకాలం పట్టనుండటంతో వరల్డ్ కప్ కు దూరం కానున్నాడు.. కేన్ లేకపోవడం న్యూజిల్యాండ్ కు కోలుకోలేని దెబ్బే.
Advertisement
తాజా వార్తలు
Advertisement