Wednesday, November 20, 2024

రాహుల్ హెచ్చరికలు: మీరు ఒక్కరిని అంటే..పది మంది వస్తారు

రెండు బ‌ల‌మైన జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతున్న‌ప్పుడు అత్యుత్త‌మ ఆటతోపాటు కొన్ని మాట‌ల యుద్ధాలు కూడా స‌హ‌జ‌మే. అయితే ఇది ఓ మోస్త‌రు వ‌ర‌కూ బాగానే ఉంటుంది కానీ శృతి మించకూడ‌దు. కాని ఇంగ్లండ్ ఆటగాళ్లు పదే పదే మాటల యుద్దానికి దిగారు. ఇంగ్లండ్‌పై లార్డ్స్ టెస్ట్ మాటల యుద్దంపై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గ్రహిత కేఎల్ రాహుల్ స్పందించాడు. రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయ‌ర్స్ ప‌దే ప‌దే టీమిండియా ఆటగాళ్లను రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రించిన తీరుపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మొద‌ట ఆండ‌ర్స‌న్‌-కోహ్లి, బుమ్రా-బ‌ట్ల‌ర్ మ‌ధ్య మాటల యుద్ధం న‌డిచింది. మీరు టీమ్‌లో ఒక్క‌రిని వేధిస్తే.. మొత్తం టీమ్‌లోని 11 మందీ మీ వెంట ప‌డ‌తారు అని ఇంగ్లండ్‌కు ఆటగాళ్లకు గట్టిగా హెచ్చరికలు పంపాడు. మీరు ఒక్క‌రి వెంట ప‌డితే.. మా టీమంతా మీ వెంట ప‌డుతుంది అని రాహుల్ అనడం విశేషం. ఈ స్ఫూర్తితోనే మా టీమంతా ఒక్క‌టిగా ముందుకు వెళ్తుంది అని అత‌డు చెప్పాడు.

ఫీల్డ్‌లో జ‌రిగిన మాట‌ల యుద్ధ‌మే మాలో మ‌రింత దూకుడు పెంచాయని కెప్టెప్ కోహ్లీ అనడం విశేషం. అదే మ్యాచ్‌ను గెల‌వాల‌న్న క‌సిని మాలో నూరిపోసింది అని కోహ్లి పేర్కొన్నాడు. 2014లోనూ ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా లార్డ్స్ టెస్ట్‌లో గెలిచింది. ఆ మ్యాచ్‌పై కోహ్లి స్పందిస్తూ.. అప్పుడు కూడా ఓ ప్లేయ‌ర్‌గా విన్నింగ్ టీమ్‌లో ఉన్నాను. ఆ మ్యాచ్‌లో ఇషాంత్ 7 వికెట్లు తీసి రాణించాడు. కానీ ఈ మ్యాచ్‌ను మాత్రం 60 ఓవ‌ర్ల‌లోపే ఫ‌లితం రాబ‌ట్టడం చాలా సంతోషంగా ఉంది. లార్డ్స్‌లో తొలిసారి ఆడుతున్న సిరాజ్‌లాంటి బౌల‌ర్ అలా బౌలింగ్ చేయ‌డం అద్భుతం అని కోహ్లి అన్నాడు.

ఇది కూడా చదవండి: తాలిబ‌న్లు చంపినా దేశం వ‌దిలి వేళ్లను: మేయర్ జ‌రీఫా

Advertisement

తాజా వార్తలు

Advertisement