ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్ తన సత్తా చాటాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో శతకంతో రాణించడం కలిసి వచ్చింది. ఏకంగా 18 స్థానాలు పైకి ఎగబాకి.. 31వ ర్యాంకులో నిలిచాడు. తొలి టెస్టు గెలుపులో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. కోహ్లీకి మళ్లి నిరాశే ఎదురైంది. ఏడో స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయాడు. విరాట్ ఖాతాలో 747 రేటింగ్ పాయింట్లే ఉన్నాయి. శ్రీలంకన్ కరుణ రత్నే, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 7, 8వ స్థానాలకు ఎగబాకారు. మరో టీమిండియా బ్యాటర్ రోహిత్ శర్మ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. 789పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆసీస్ బ్యాటర్ లబుషేన్ (915) టాప్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ మూడో స్థానం నుంచి నాల్గుకు పడిపోయాడు. స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఆరో స్థానంలో వార్నర్, పదో స్థానంలో ట్రావియస్ హెడ్ ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ 11వ స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ 16వ స్థానానికి పడిపోయాడు. బౌలింగ్‌లో పాట్ కమిన్స్ (902) టాప్‌లో, రవిచంద్రన్ అశ్విన్ (873) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ, నాలుగో స్థానంలో కివీస్ పేసర్ టిమ్ సౌథీ ఉన్నాడు. ఐదో స్థానంలో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ కొనసాగుతున్నాడు. బుమ్రా (781) 9వ స్థానంలో, సఫారీ పేసర్ రబాడా(810) ఆరో స్థానంలో కొనసాగుతున్నారు.
గత ర్యాంకులతో పోలిస్తే.. తమ స్థానాలు వీరిద్దరూ మెరుగుపర్చుకున్నారు. టాప్-10లోకి బుమ్రా అడుగుపెట్టాడు. ఏడో స్థానంలో ఆసీస్ పేసర్ హాజిల్‌వుడ్, 8వ స్థానంలో కివీస్ బౌలర్ వాగ్నర్, పదో స్థానంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital