వరుసగా మూడు విజయాలు సాధించి ఊపు మీదున్న ఆ జట్లకు ఓటమి షాక్ తగిలింది. ఇప్పుడు మళ్లీ విజయాల బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. ఆ రెండు టీమ్‌లు కోల్‌కతా–లఖ్‌నవూ..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన కె కె ఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది.. లక్నో బ్యాటింగ్ కు దిగనుంది
హ్యాట్రిక్ విజయాలు సాధించి దూకుడు మీదున్న కోల్‌కతాకు చెన్నై అడ్డుగా నిలిచింది. ఇప్పుడు సొంత మైదానంలో లఖ్‌నవూతో తలపడనుంది. బ్యాటింగ్ పరంగా కోల్‌కతాకు పెద్ద ఇబ్బందేం లేదు. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ శుభారంభం అందిస్తున్నారు. యువ బ్యాటర్ రఘువంశి, రింకు సింగ్, ఆండ్రి రస్సెల్ దూకుడుగా ఆడుతున్నారు. లఖ్‌నవూ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ విషయానికొచ్చేసరికి స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రి రస్సెల్ బౌలింగ్‌లో రాణించడంతో కోల్‌కతా విజయాలను నమోదు చేయగలిగింది. స్టార్క్ కూడా ఫామ్‌లోకి వస్తే కోల్‌కతాను ఆపడం ప్రత్యర్థులకు కష్టమే.