Friday, November 22, 2024

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ -ఉమేష్, జాస‌న్ రాయ్, అనుకూల్ రాయ్ లు ఔట్ – 97/9

ఐ పీఎల్ 202 3సీజన్‌లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోంటున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది.. బ్యాటింగ్ కు దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌రుస‌గా వికెట్లు పోగొట్టుకుంటూనే ఉంది… నిల‌క‌డ‌గా ఆడుతున్న జేస‌న్ రాయ్ 43 ప‌రుగులు చేసి కుల‌దీప్ బౌలింగ్ లో ఏడో వికెట్ గా వెనుతిరిగాడు.. ఆ త‌ర్వాత బంతికే అనుకూల్ రాయ్ సున్న పరుగుల‌కు కుల‌దీప్ ప‌డ‌గొట్టాడు. ఆ తర్వాత మూడు పరుగులు చేసిన ఉమేష్ యాదవ్ ను నోకియా పెవిలియన్ కు పంపాడు.. అంత‌కుముందు 2 ప‌రుగులు చేసిన సునీల్ న‌రైన్ ను అక్ష‌ర ప‌టేల్ ఔట్ చేశాడు. రింకూ సింగ్ 6 ప‌రుగులు చేసి అక్ష‌ర ప‌టేట్ బౌలింగ్ లో ఔట‌య్యాడు. అంత‌కు ముందు 12 ప‌రుగులు చేసిన మ‌న్ దీప్ సింగ్ ను అక్ష‌ర ప‌టేల్ నాలుగో వికెట్ గా ప‌డ‌గొట్టాడు.. నాలుగు ప‌రుగులు చేసిన రానా మూడో వికెట్ గా వెనుతిరిగాడు.. ఈ వికెట్ ఇషాంత్ శ‌ర్మ‌కు ల‌భించింది.. కాగా, తొలి వికెట్ గా లింట‌న్ దాస్, రెండో వికెట్ గా వెంక‌టేష్ అయ్య‌ర్ లు వెంట‌వెంట‌నే అవుల‌య్యారు.. లింట‌న్ 4 ప‌రుగులు చేయ‌గా, అయ్య‌ర్ డ‌కౌట్ గా వెనుతిరిగాడు .. లింట‌న్ వికెట్ ముఖేష్ కుమార్, అయ్యర్ వికెట్ నోకియాకు ల‌భించాయి.. ప్ర‌స్తుతం 16 ఓవ‌ర్లో 9 వికెట్ల న‌ష్టానికి 97 ప‌రుగులు చేసింది.
కాగా, ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్ లలో అయినా విజయాలు సాధించగా.. వార్నర్‌ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు. ఆడిన ఐదు మ్యాచ్ లలో వరుసగా 5 మ్యాచ్‌లో ఓడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీ జట్టు గెలుపు బాట పట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement