రాయ్‌పూర్: న్యూజిలాండ్‌తో జరగనున్న రెండవ వన్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. రాయ్‌పూర్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. బౌలింగ్ నిర్ణయం సరైనదేలా భారత్ పేస్ బౌలర్లు టపటప వికెట్లు పడగొట్టారు.. బ్యాటింగ్ కు దిగిన కివీస్ కు రెండో ఓవర్ లోనే దెబ్బ తగిలింది..షమీ వేసిన తొలి ఓవర్ అయిదో బంతికి కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ డకౌట్ అయ్యాడు.ఆ తర్వాత సిరాజ్ తన మూడో ఓవర్ లో నికోలస్ ను పెవిలియన్ కు పంపాడు.. ఆ తర్వాత షమీ తన నాలుగో ఓవర్ లో డెరియల్ మిచెల్ ను వెనక్కి పంపాడు . హర్థిక్ తన తొలి ఓవర్ లోనే కాన్వేను ఔట్ చేశాడు. ఆ తర్వాత శార్దూల్ కూడా తన తొలి ఓవర్ లోనే కివీస్ స్కిపర్ టామ్ లాథమ్ వికెట్ తీసుకున్నాడు.. ప్రస్తుతం కివీస్ 15 ఓవర్లు ముగిసేనాటికి అయిదు వికెట్ల నష్టానికి 33 కివీస్ బ్యాటర్ లు పిన్ అలెన్ డక్, డేవిన్ కాన్వే 7, హెన్రీ నికోలస్ 2, డెరియల్ మిచెల్ 1, టామ్ లాథమ్ 1 పరుగులకు అవుటయ్యారు. . కాగా హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే టీమిండియా,న్యూజిలాండ్ లు ఈ మ్యాచ్ లో కూడా బరిలోకి దిగాయి..
Advertisement
తాజా వార్తలు
Advertisement