ఇక్సాన్ సిటీ (కొరియా): భారత యువ షట్లర్ కిరణ్ జార్జ్ కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ కిరణ్ జార్జ్ (భారత్) 21-14, 21-16 తేడాతో జపాన్‌కు చెందిన టకుమా ఒబయాషిని వరుస గేముల్లో చిత్తుచేసి హ్యాట్రిక్ విజయంతో సెమీస్‌లో అడుగుపెట్టాడు.
ఈ మ్యాచ్‌లో మొదటి నుంచే చెలరేగి ఆడిన 24 ఏళ్ల జార్జ్ జపాన్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. చివరి వరకూ అదే జోరు కొనసాగించిన కిరణ్ 39 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించేసి టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. ఇక సెమీస్ పోరులో థైలాండ్ స్టార్, టాప్ సీడ్ కున్లావుట్ విటిద్సర్న్తో కిరణ్ జార్జ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.