Thursday, November 21, 2024

BGT 2024 | కింగ్‌ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు…

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా శుక్ర‌వారం నుంచి భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. కాగా, ఈ టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాటర్‌ కోహ్లీని అనేక రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ టోర్నీలో 458 పరుగులుచేస్తే ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్‌ తెందూల్కర్‌ పేరిట ఉంది. సచిన్‌ 20 టెస్టుల్లో 1,809 రన్స్‌ చేశాడు. కోహ్లీ 13 టెస్టుల్లో 1,352 పరుగులు సాధించాడు.

  • సెంచరీల విషయానికొస్తే, ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ ఆరు శతకాలు బాదాడు. మరో నాలుగు సెంచరీలు చేస్తే ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జాక్‌ హాబ్స్‌ను (9 సెంచరీలు) అధిగమిస్తాడు. ఆసీస్‌ గడ్డపై అత్యధిక సెంచరీలు కొట్టిన విదేశీ ప్లేయర్‌గా రికార్డుకెక్కుతాడు.
  • అడిలైడ్‌ ఓవల్‌ స్టేడియంలో మరో సెంచరీ చేస్తే ఎక్కువ సెంచరీలు కొట్టిన విదేశీ బ్యాటర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు కోహ్లీ అడిలైడ్‌ స్టేడియంలో 11 మ్యాచుల్లో 5 సెంచరీలతో జాక్‌ హాబ్స్‌తో సమానంగా ఉన్నాడు.
  • అలాగే, ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు చేస్తే, ఆసీస్‌పై అత్యధిక సెంచరీల రికార్డులో సచిన్‌ను దాటేస్తాడు. సచిన్‌ 110 మ్యాచుల్లో 20 శతాలు బాదాడు. విరాట్‌ 16 సెంచరీలు చేశాడు.
  • అడిలైడ్‌లో మరో 102 రన్స్‌ సాధిస్తే విండీస్‌ దిగ్గజ ప్లేయర్‌ బ్రియన్‌ లారా రికార్డును బ్రేక్‌ చేస్తాడు. అడిలైడ్‌ ఓవల్‌లో లారా 610 పరుగులు చేయగా, విరాట్‌ 509 పరుగులతో ఉన్నాడు.
  • ఇక ఆస్ట్రేలియా గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్‌ 3,426 పరుగులు చేశాడు. సచిన్‌ తర్వాత ఆస్ట్రేలియాపై ఎక్కువ పరుగుల చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. మరో 574 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో 4,000 రన్స్‌ చేసిన తొలి ఆటగాడవుతాడు.
  • ఆస్ట్రేలియాపై ఎక్కువ మ్యాచ్‌లు(110) ఆడిన రికార్డు సచిన్‌ పేరిట ఉంది. మరో మూడు మ్యాచ్‌లు ఆడితే విరాట్‌ 100 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరిపోతాడు.
  • ఆస్ట్రేలియాపై అత్యధిక హాఫ్‌సెంచరీల జాబితాలో వివియన్‌ రిచర్డ్స్‌ (43), డెస్మండ్ హెన్స్‌ (34) ముందున్నారు. ప్రస్తుతం విరాట్‌ (30) మూడవ స్థానంలో ఉన్నాడు. మరో 5 హాఫ్‌ సెంచరీలు చేస్తే హేన్స్‌ రికార్డును బ్రేక్‌చేసినట్లు అవుతుంది.
  • కోహ్లీ 2011 నుండి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో 24 టెస్టుల్లో 42 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎనిమిది సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలతో 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు.
Advertisement

తాజా వార్తలు

Advertisement