Monday, November 25, 2024

Breaking: బ్యాడ్మింటన్​లో నెక్ట్స్​ లెవల్​కి కిదాంబి శ్రీకాంత్​.. హాంకాంగ్​పై విజయం, సింగపూర్​తో పోరు!

డెన్మార్క్​ సూపర్​ 750 బ్యాడ్మింటన్​ టోర్నీలో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్​ మరో రౌండ్​లోకి దూసుకెళ్లాడు. మంగళవారం ఒడెన్స్ లో జరిగిన టోర్నమెంట్‌లో శ్రీకాంత్ హాంకాంగ్‌కు చెందిన ఎన్‌జి కా లాంగ్ అంగస్ నుంచి ఓ గొప్ప సవాలును అధిగమించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత తదుపరి రౌండ్​లో 2021లో వరల్డ్​ చాంపియన్​ అయిన సింగపూర్​ క్రీడాకారుడు లోహ్​ కీన్​ యూతో తలపడనున్నాడు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత అయిన భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్​ డెన్మార్క్​లో జరుగుతున్న బ్యాడ్మింటన్​ టోర్నీలో నెక్ట్స్​ లెవల్​కి దూసుకెళ్లాడు. ఇవ్వాల జరిగిన 56 నిమిషాల పోటీలో ప్రపంచ నంబర్ 14 హాంకాంగ్ ఆటగాడిపై 17-21 21-14 21-12 తేడాతో విజయం సాధించాడు. 3-3 హెడ్-టు-హెడ్ రికార్డ్ తో మ్యాచ్‌లో పట్టు సాధించిన శ్రీకాంత్, అంగస్‌పై కాస్త దూకుడుగానే ఆడాడు. హాంకాంగ్ ఆటగాడు మిడ్-గేమ్ విరామంలో 11-8 ఆధిక్యంలోకి రావడంతో  కొంచెం వెనకబడ్డట్టు అనిపించినా ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాడు. 

ఆఖరికి ఓపెనింగ్ గేమ్‌ను చేజిక్కించుకోవడానికి భారత క్రీడాకారుడు శ్రీకాంత్​కు చాన్స్​ ఇవ్వకుండా​ అంగస్ ఆటతీరును మార్చేశాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్ 6-3తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ అంగస్ 10-8తో మరింత దూకుడు చూపాడు. ఇక.. శ్రీకాంత్ టైమింగ్​ని దృష్టిలోపెట్టుకున తన ఆటలో స్పీడ్​ పెంచాడు. దీంతో 16-10కి చేరుకోవడానికి వరుసగా ఎనిమిది పాయింట్లను సాధించాడు.

ఇక.. మ్యాచ్‌ని డిసైడర్‌ లెవల్​కి తీసుకెళ్లే క్రమంలో అప్పుడు కానీ కాస్త  ప్రశాంతంగా ఉండలేకపోయాడు. మూడో గేమ్‌లో శ్రీకాంత్ విరామానికి 11-4 ని చేరుకోవడానికి తన అన్ని టెక్నిక్స్​ని ఉపయోగించాడు. నెట్ వద్ద కొన్ని మంచి బెటర్​మెంట్ షాట్‌లను కొట్టి హాంకాంగ్​ క్రీడాకారుడుని కోలుకోలేని దెబ్బకొట్టాడు. అతని ప్రత్యర్థి ఫ్రంట్ కోర్ట్ లో షార్ప్​ రిటర్న్ తో మ్యాచ్‌ను ముగించేలా కోర్టును కవర్ చేస్తూ షాట్​ మీద షాట్ కొట్టి ప్రత్యర్థిని గుక్కతిప్పుకోనీయలేదు. దీంతో గెలుపు సొంతం చేసుకుని తదుపరి రౌండ్​లో శ్రీకాంత్ 2021 ప్రపంచ చాంపియన్ సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూతో తలపడనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement