– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
2021 ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అయిన భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నీలో నెక్ట్స్ లెవల్‌కి దూసుకెళ్లాడు. ఇవ్వాల జరిగిన 56 నిమిషాల పోటీలో ప్రపంచ నంబర్ 14 హాంకాంగ్ ఆటగాడిపై 17-21 21-14 21-12 తేడాతో విజయం సాధించాడు. 3-3 హెడ్-టు-హెడ్ రికార్డ్ తో మ్యాచ్‌లో పట్టు సాధించిన శ్రీకాంత్, అంగస్పై కాస్త దూకుడుగానే ఆడాడు. హాంకాంగ్ ఆటగాడు మిడ్-గేమ్ విరామంలో 11-8 ఆధిక్యంలోకి రావడంతో కొంచెం వెనకబడ్డట్టు అనిపించినా ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాడు.
ఆఖరికి ఓపెనింగ్ గేమ్‌ను చేజిక్కించుకోవడానికి భారత క్రీడాకారుడు శ్రీకాంత్‌కు చాన్స్ ఇవ్వకుండా అంగస్ ఆటతీరును మార్చేశాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్ 6-3తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ అంగస్ 10-8తో మరింత దూకుడు చూపాడు. ఇక.. శ్రీకాంత్ టైమింగ్‌ని దృష్టిలోపెట్టుకున తన ఆటలో స్పీడ్ పెంచాడు. దీంతో 16-10కి చేరుకోవడానికి వరుసగా ఎనిమిది పాయింట్లను సాధించాడు.
ఇక.. మ్యాచ్‌ని డిసైడర్ లెవల్‌కి తీసుకెళ్లే క్రమంలో అప్పుడు కానీ కాస్త ప్రశాంతంగా ఉండలేకపోయాడు. మూడో గేమ్‌లో శ్రీకాంత్ విరామానికి 11-4 ని చేరుకోవడానికి తన అన్ని టెక్నిక్స్‌ని ఉపయోగించాడు. నెట్ వద్ద కొన్ని మంచి బెటర్మెంట్ షాట్లను కొట్టి హాంకాంగ్ క్రీడాకారుడుని కోలుకోలేని దెబ్బకొట్టాడు. అతని ప్రత్యర్థి ఫ్రంట్ కోర్ట్ లో షార్ప్ రిటర్న్ తో మ్యాచ్‌ను ముగించేలా కోర్టును కవర్ చేస్తూ షాట్ మీద షాట్ కొట్టి ప్రత్యర్థిని గుక్కతిప్పుకోనీయలేదు. దీంతో గెలుపు సొంతం చేసుకుని తదుపరి రౌండ్లో శ్రీకాంత్ 2021 ప్రపంచ చాంపియన్ సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూతో తలపడనున్నాడు.