కెన్యాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ క్రీడాకారుడు యువ మారథాన్ స్టార్ అథ్లెట్ కెల్విన్ కిప్టుమ్ కన్నుమూశారు. అతడితో పాటు అతని కోచ్ గెర్వైస్ హకిజిమానా కూడా మృతి చెందారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం పశ్చిమ కెన్యాలోని ఎల్డోరెట్-కప్తగట్ పట్టణాల మధ్య రహదారిపై జరిగింది.
కెన్యాలోని కప్తగట్ నుంచి ఎల్డోరెట్‌కు కెల్విన్ తో పాటూ మరో ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు. వారిలో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను సమీప ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ కమాండర్ పీటర్ ములింగే తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కిప్టుమ్ స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తున్నారని, అతి వేగం కారణంగానే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టిందని తెలిపారు. కిప్టమ్ కోచ్, హకిజిమానా రిటైర్డ్ రువాండిస్ రన్నర్. కోచ్, అథ్లెట్ లుగా వారి అనుబంధం 2018లో ప్రారంభమైంది.
యంగ్ సూపర్ స్టార్
కిప్తమ్ (24) గతేడాది అక్టోబర్‌లోనే మారథాన్‌లో ప్రపంచ రికార్డు సృష్టించారు. షికాగోలో జరిగిన ఆ పోటీల్లో 2 గంటల 35 సెకన్లతో వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. కెన్యాకే చెందిన ఎలియడ్ కిప్చోగే పేరిట ఉన్న రికార్డును 34 సెకన్ల ముందే అధిగమించి సత్తా చాటారు. 2022లో వాలెన్సియాలో జరిగిన మారథాన్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక లండన్, చికాగో రేసులను గెలుచుకున్నారు. ఇక 2023 అక్టోబరులో జరిగిన మారథాన్‌లో మరో అరుదైన రికార్డు అందుతున్నాడు. మూడో పోటీలోనే ఈ ఘనత సాధించడం విశేషం.