హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రపంచంలో ఉన్న అన్ని క్రీడా స్టేడియాలను తలదన్నే విధంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణాలో భారీ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రంగా రెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఈ భారీ స్పోర్ట్స్ స్టేడియంను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రపంచంలో ఏ క్రీడా పోటీ-లు జరిగినా అవి హైదరాబాద్‌లోనే నిర్వహించే విధంగా ఈ కొత్త స్టేడియం నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభిలషిస్తున్నట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్టేడియం నిర్మాణం పూర్తయితే ప్రపంచానికే తలమానికం అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి(44 నేషనల్ హైవే)కి సమీపంలో శంషాబాద్ అంతర్జాతీయ వినాశ్రయానికి అత్యంత చేరువలో ఈ భారీ స్టేడియం నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. అంతర్జాతీయ క్రీడలన్నీ ఈ స్టేడియంలోనే నిర్వహించేలా అన్ని రకాల మౌలిక, వసతి సౌకర్యాలు కల్పించాలని ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ పోటీ-లను నిర్వహించుకునేలా అన్ని హంగులు సమకూర్చాలని నిర్ణయించినట్టు- సమాచారం. తాను చైనా వెళ్ళినప్పుడు అక్కడ తానొక స్టేడియంను చూశానని, తాను చేపట్టిన తెలంగాణ ఉద్యమం విజవంతమై కొత్త రాష్ట్రం ఏర్పడితే చైనా లాంటి స్టేడియంను స్వరాష్ట్రంలో నిర్మించాలని అప్పుడే అనుకున్నానని, ఆ కలలు సాకారమయ్యే రోజు సమీపించాయని సీఎం కేసీఆర్ ఇటీ-వల తనను కలిసిన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు- తెలుస్తోంది. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఈ భారీ స్టేడియం నిర్మాణానికి అడుగులు పడ్డాయని చెబుతున్నారు.
నూతన సచివాలయం సమీపంలో భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు- చేసిన ప్రభుత్వం నూతన సచివాలయ భవనాలను ఈ నెల 30న ప్రారంబించేందుకు ఏర్పాట్లు- ముమ్మరం చేస్తోంది. అమరవీరు ల స్మారక స్థూపం నిర్మాణం పనులు కూడా ముగింపు దశకు చేరుకు న్నాయని చెబుతున్న ప్రభుత్వం ఆ తర్వాత శంషాబాద్ అంతర్జాతీయ క్రీడా స్టేడియం నిర్మాణంపైనే దృష్టి సారించాలని నిర్ణయించినట్టు- ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ క్రీడా స్టేడియం నిర్మాణానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే ఆ మొత్తాన్ని సమకూర్చేలా ప్రణాళికలలను కూడా రూపొందిస్తున్నట్టు- చెబుతున్నారు.
విమానాశ్రయానికి చేరువలో !
ఆటల పోటీ-ల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే క్రీడాకారుల సౌకర్యార్థం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలోనే ఈ స్టేడియం నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. స్టేడియంను మూడు నుంచి నాలుగు వేల ఎకరాల్లో నిర్మించాలని ఇందుకు అవసరమైన భూములను సమీకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్టు- సమాచారం. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటు-లో ఉందని మిగతా భూములను సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది . మూడువందల ఎకరాలకు పైగా భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు- చెబుతున్నారు. ప్రతిపాదిత స్టేడియం నిర్మాణానికి సంబందించిన ప్రాంతంలో అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయని, వాటిని లబ్ధిదారుల నుంచి తీసుకుని మరో ప్రాంతంలో వారికి భూములివ్వాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు- సమాచారం. వివిధ కారణాలతో వివాదంలో పడిన భూములు కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్టు- రెవెన్యూ శాఖ అధికారులు నివేదించినట్టు- తెలుస్తోంది.
అన్ని క్రీడలు జరిగేలా!
క్రికెట్‌తో సహా బాస్కెట్ బాల్, -టె-న్నిస్, హాకీ, పోలో, లుడో, స్నూకర్, బ్యాడ్మింటన్, కబాడీ, ఖోఖో బాక్సింగ్, హాకీ ఇలా ఔట్‌డోర్, ఇండోర్ గేమ్స్ నిర్వహించేందుకు వీలుగా స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదిందించింది. క్రికెట్ మ్యాచ్‌లు జరిగినపుడు ఐదు లక్షల మంది అభిమానులు వచ్చి వీక్షించిన ఎటు-వంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు- చేయాలని వాహనాల పార్కింగ్‌కు అవసరమైన స్థలాన్ని కేటాయించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సమాయత్తమైంది. స్టేడియం నిర్మాణానికి ముందు అధికారుల బృందాన్ని ఆయా దేశాలకు పంపించి అధ్యయనం చేయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు- సమాచారం.