Monday, September 16, 2024

Kane Williamson: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీ20 WCలో లీగ్ స్టేజ్ నుంచే న్యూజిలాండ్ ఇంటిదారి పట్టడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు 2024-25 సీజన్ సెంట్రల్ కాంట్రాక్టును కూడా అతడు వదులుకున్నాడు.

అయితే, అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలోనూ కొనసాగనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా కేన్ విలియమ్సన్… ఐపీఎల్ టోర్నమెంట్ లో కూడా రాణించిన సంగతి తెలిసిందే. మొదట హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు కేన్ విలియమ్సన్. ఆ తర్వాత గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కేన్ మామ.

టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే కివీస్‌ వెనుదిరగడంతో కేన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. టీ 20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్‌లతో ఓడిపోయిన తర్వాత కివీస్‌ గ్రూప్ దశల్లోనే నిష్క్రమించింది. కేన్ విలియమ్సన్ 2024-25 సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించినా మూడు ఫార్మాట్‌లలో కివీస్‌కు ఆడతానని ప్రకటించాడని కివీస్‌ బోర్డు వెల్లడించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement