ఐపీఎల్ ముగియడంతో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్.తమిళనాడు కాంచీపురంలోని ఓ వేద పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న పిల్లల తో కలిసి సరదాగా గడిపాడు. వారితో కలిసి సంప్రదాయ దుస్తులు ధరించి క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. క్రికెట్ పట్ల వీరికి ఉన్న ప్రేమ నమ్మశక్యం కానిది. కాంచీపురంలోని వేద పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులతో సరదాగా ఇలా గడిపాను అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ పిల్లల కల నిజమైంది, మీపై గౌరవం 10000000000000000000 శాతం పెరిగింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అయ్యర్ తన ఐపీఎల్ (IPL) కెరీర్‌లో మొత్తం 36 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 956 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. దీంతో పాటు టీమిండియా తరఫున రెండు వన్డేలు, తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement