Friday, November 22, 2024

IPL : ఐపిఎల్ లో క‌మ్రాన్ ఖాన్ సంచ‌ల‌నం…

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రిచ్చెస్ట్ లీగ్.. మరోసారి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇవ్వనుంది. ఇలాంటి తరుణంలో మనం ఓసారి రివైండ్‌కి వెళ్తే.. ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఎక్కువగా అనుభవం లేని యువ ప్లేయర్స్.. కొద్దిమంది సీనియర్లతో రాజస్తాన్ జట్టును.. అప్పటి కెప్టెన్ షేన్ వార్న్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఛాంపియన్‌గా నిలిపాడు. కట్ చేస్తే.. మరుసటి సంవత్సరం.. ఐపీఎల్ రెండో సీజన్‌లోని ఒక మ్యాచ్‌లో ఓ 18 ఏళ్ల యువకుడికి బంతి అప్పగించాడు షేన్ వార్న్. ఎంతోమంది అనుభవమున్న ప్లేయర్స్ మధ్య మరో ఆలోచన లేకుండానే వార్న్.. ఈ యంగ్ ప్లేయర్‌ని బౌలింగ్ చేయమన్నాడు. అంతే.! ఐపీఎల్ చరిత్రలోనే తొలి సూపర్ ఓవర్ వేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. మరి అతడెవరో తెలుసా.? అతడి పేరు కమ్రాన్ ఖాన్. క్రికెట్‌లో అదరగొట్టి.. ప్రస్తుతం టెన్సిస్ ఆడుతున్నాడు.

- Advertisement -

2009 ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టు డైరెక్టర్ డారెన్ బెర్రీ‌స్కౌట్ క్యాంప్‌లో కనుగొన్న ఓ ఆణిముత్యం ఈ కమ్రాన్ ఖాన్. ఈ భారత పేసర్ గంటకు 140 కి.మీ వేగంతో వెరైటీ యాక్షన్‌తో అద్భుతమైన బౌలింగ్ చేసేవాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో సూపర్ ఓవర్ వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 2009లో కేకేఆర్‌పై కమ్రాన్ ఖాన్ మొదటి సూపర్ ఓవర్ వేశాడు. అయితే ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు కారణంగా కమ్రాన్ ఖాన్ క్రికెట్‌ను విడిచిపెట్టాడు. ఒకప్పుడు లెజెండరీ షేన్ వార్న్ మెచ్చిన కమ్రాన్ ఖాన్.. ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడిన కమ్రాన్ ఖాన్‌కు.. జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం దక్కలేదు. ఐపీఎల్‌లో 2 సీజన్లలో కలిపి మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడాడు కమ్రాన్ ఖాన్. ఆ తర్వాత రాజస్తాన్ నుంచి 2011లో పూణే వారియర్స్‌కు మారాడు. అనంతరం క్రమాన్ ఐపీఎల్ కెరీర్ ముగిసింది. కమ్రాన్‌కి ఉత్తరప్రదేశ్ తరఫున 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. రైతుగా, కార్పెంటర్‌గా.. ఇలా బ్రతుకు జట్కా బండిని నడిపేందుకు ఎన్నో పనులు చేశాడు కమ్రాన్ ఖాన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement