Thursday, November 21, 2024

వైస్ కెప్టెన్ ప‌ద‌వి నుంచి కె ఎల్ రాహుల్ ఊస్టింగ్….

ముంబై – గ‌త ఏడాది కాలంగా ఫామ్ కోల్పోయి పరుగుల కోసం ఏడాదిగా తంటాలు పడుతున్న టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాకిచ్చింది. ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు నిన్న జట్టును ప్రకటించిన బీసీసీఐ . రాహుల్ నుంచి వైస్ కెప్టెన్ ట్యాగ్‌ను తీసేసింది. వైస్ కెప్టెన్సీ నుంచి రాహుల్‌ను తప్పించినప్పటికీ జట్టులో మాత్రం అతడికి చోటు కల్పించింది. బంగ్లాదేశ్ పర్యటనలో చతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ తాజాగా అతడి పేరును కూడా బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. కాగా, గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి భారత జట్టు నాయకత్వ టీంలో భాగమైన రాహుల్ శ్రీలంక‌తో సిరీస్ తర్వాత టెస్టు జట్టు శాశ్వత వైస్ కెప్టెన్ అయ్యాడు. అయితే, గత ఏడాది కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేకపోవడం, ఈ కాలంలో ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. సత్తా ఉన్న యువ ఆటగాళ్లను పక్కనపెట్టి అతడికి చోటు కల్పిస్తున్నా దానిని నిలబెట్టుకోలేకపోవడంతో తాజాగా వైస్ కెప్టెన్సీ పదవి నుంచి తొల‌గించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement