లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు షాక్ తగిలింది. గాయం కారణంగా జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నాడు . బెంగళూరు తో జరిగిన మ్యాచ్ రెండో ఓవర్‌లో డుప్లెసిస్ ఎక్స్‌ట్రా కవర్స్ వైపు కొట్టిన బంతిని ఆపే క్రమంలో రాహుల్ గాయపడ్డాడు. అతడి కుడి తొడ పట్టేయడంతో మైదానంలో కూప్పకూలిన రాహుల్ ఫిజియో సహాయంతో స్టేడియాన్ని వీడాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ పరిగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు. గాయం పెద్దది కావడంతో టోర్నిని నుంచి దూరంగా ఉండాలని బిసిసిఐ సూచించింది.. దానికి ప్రధాన కారణం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ భారత్ జట్టులో రాహుల్ కీలక సభ్యుడు.. అలాగే ఇదే జట్టులో ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్ కూడా గాయపడి టోర్నికి దూరమయ్యాడు.. ఉనద్కత్ కూడా భారత్ జట్టుకి ఎంపికయ్యాడు.. దీంతో ఎల్ రాహుల్, ఉనద్కత్ బాధ్యతలను బీసీసీఐ, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) తీసుకున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ మెడికల్ టీమ్ అబ్జర్వేషన్లో ఉన్నాడు. . రాహుల్‌కు ముంబయిలో బీసీసీఐ ఆధ్వర్యంలో స్కానింగ్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మరోవైపు, జూన్ 7 నుంచి 11 వరకు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది.. అప్పటి ఈ ఇద్దరిని సిద్ధం చేయాలని బిసిసిఐ భావిస్తున్నది..
Advertisement
తాజా వార్తలు
Advertisement