Tuesday, September 17, 2024

Junior Hockey World Cup | క్వాలిఫై అయిన జట్లు ఇవే…

2024 జూనియర్‌ పాన్‌ అమెరికన్‌ చాంపియన్‌షిప్స్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. అలాగే 2025 డిసెంబర్‌లో భారత్‌లో జరుగనున్న జూనియర్‌ మెన్స్‌ హాకీ వరల్డ్‌ కప్‌కు బెర్త్‌ ఖరారైంది. అర్జెంటీనాతో పాటు కెనడా, చిలీ జట్లు కూడా వరల్డ్‌ కప్‌ బెర్త్‌ సాధించాయి. వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయింగ్‌లో అర్జెంటీనా గోల్డ్‌ మెడల్డ్‌ సాధించగా, కెనడా సిల్వర్‌, చిలీ బ్రాంజ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది.

ఇక మహిళల విభాగానికి వస్తే, పాన్‌ అమెరికన్‌ రీజియన్‌లో నాలుగు బెర్త్‌లుండగా, జూనియర్‌ వరల్డ్‌ కప్‌కు అర్జెంటీనా గోల్డ్‌ మెడల్‌తో బెర్త్‌ ఖరారైంది. అలాగే సిల్వర్‌ మెడల్‌తో యునైటెడ్‌ స్టేట్స్‌, బ్రాంజ్‌ మెడల్‌తో చిలీ కూడా బెర్త్‌లు కన్ఫామ్‌ చేసుకున్నాయి. వీటితోపాటు ఉరుగ్వే కూడా జూనియర్‌ వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement