ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆసీస్ 2-0తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కాగా, స్వల్ప టార్గెట్ తో చేజింగ్ కు దిగిన పాక్.. స్పెన్సర్ జాన్సన్ (5/26) పేస్ ధాటికి చేతులెత్తేసింది. ఐదు వికెట్లతో చెలరేగిన జాన్సన్ పాక్ పతనాన్ని శాశించాడు. ఆడమ్ జంపా (2/19) టెయిలెండర్ల పనిపట్టగా.. జేవియర్ బార్ట్లెట్ (1/18) ఒక వికెట్ దక్కించుకున్నాడు. దీంతో పాకిస్థాన్ జట్టు 19.4 ఓవర్లకు 134 పరుగులకే కుప్పకూలింది.
ఇక అంతకముందు తొలి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా… బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ (32), జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (20), గ్లెన్ మాక్స్వెల్ (21), ఆరోన్ హార్డీ (28) పరుగులతో రాణించారు. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సుఫియాన్ ముఖీమ్ (2/21) వికెట్లు దక్కించుకున్నారు.