Friday, September 6, 2024

Record | జోరూట్ శ‌త‌కాల మోత‌..

వెస్టిండీస్‌పై విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ రికార్డులు బద్దలుకొట్టాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరూట్ సెంచరీతో కదం తొక్కాడు. 178 బంతుల్లో 122 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్‌ (109)తో కలిసి 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఈ క్రమంలో జో రూట్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ప్రస్తుత ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. యాక్టిట్ ప్లేయర్ల జాబితాలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లి (80) నిలిచాడు. రెండో స్థానంలో జోరూట్, రోహిత్ శర్మ ఉన్నారు. వీరిద్దరు అన్ని ఫార్మాట్లలో కలిపి 48 సెంచరీలు సాధించారు. అయితే రూట్ 450 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, రోహిత్ 506 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు.

కాగా, ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన పదో ప్లేయర్‌గా జో రూట్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్ (100) ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో విరాట్ కోహ్లి (80), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా, 71), కుమార సంగక్కర (శ్రీలంక, 63), జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా, 62), హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా, 55), జయవర్ధనే (శ్రీలంక, 54), బ్రియాన్ లారా (వెస్టిండీస్, 53), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, 49), జో రూట్ (48), రోహిత్ శర్మ (48), రాహుల్ ద్రవిడ్ (48) ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement