పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైట్‌బాల్ క్రికెట్ జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ అకిబ్ జావేద్‌ను నియమించింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు జావేద్ వన్డే, టీ20 జట్లకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తాడు.
మొన్నటి వరకు జట్టుకు సేవలు అందించిన గ్యారీ కిర్‌స్టన్ ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌కి ముందు వైట్-బాల్ కోచ్‌గా వైదొలిగారు. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే సిరీస్‌లకు తాత్కాలిక కోచ్‌గా జాసన్ గిల్లెస్పీని నియమించారు. సీనియర్ పురుషుల జట్టుతో తన పదవీకాలంలో, జావేద్ పురుషుల జాతీయ ఎంపిక కమిటీలోనూ సీనియర్ సభ్యునిగా కొనసాగుతారు.
మరోవైపు పీసీబీ శాశ్వత ప్రధాన కోచ్ కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తుందని, ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసేలోగా ఆ ప్రక్రియ పూర్తిచేయాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. గిల్లెప్సీ దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సరీస్‌కు ప్రధాన కోచ్‌గా ఉంటాడని పీసీబీ పేర్కొంది. ఈటోర్నీ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది.