ఇండియా ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో ప్రముఖ యూటూబర్ జార్వో 69 హంగామ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. జార్వో 69… ఈ పేరు క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తతం సోషల్ మీడియాలో జార్వో ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మ్యాచులు జరుగుతున్నప్పుడు గ్రౌండ్లోకి వచ్చి అతడు ఆటకు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. అయితే జార్వో చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారత బౌలర్ బుమ్రాకి కృతజ్ఞతలు చెబుతూ పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. “నేను జస్ప్రీత్ బుమ్రాకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.. ఎందుకంటే అతడు జానీ బెయిర్‌స్టోను డకౌట్ చేశాడు. ఎందుకంటే ఈ జానీ బెయిర్‌స్టో నన్ను ఆ రోజు తిట్టాడు.. అందుకే ఇలా” అని రాసుకొచ్చాడు.
ఇక జార్వో విషయానికి వస్తే.. లార్డ్స్ టెస్టులో టీమిండియా జెర్సీ వేసుకొని ఫీల్డింగ్ చేస్తూ ”టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి బరిలోకి దిగిన తొలి ఇంగ్లండ్ వ్యక్తిని నేనే ” అంటూ రచ్చ చేశాడు. ఇక మూడో టెస్టులో సెక్యూరిటీ కళ్లుగప్పి కోహ్లి స్థానంలో ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక నాలుగో టెస్టులో ఏకంగా బౌలర్ అవతారమే ఎత్తాడు. అయితే ఆ సమయంలో క్రీజులో ఉన్న బెయిర్‌స్టోని అమాంతం తోసేసినంత పనిచేశాడు. దీంతో బెయిర్ స్టో అతడిని కోపంతో చూశాడు. అంతకుముందు రెండో టెస్టు సమయంలోనూ బెయిర్ స్టో, జార్వోని తిట్టడం కనిపించింది.
ఇది కూ డాచదవండి