భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మాజీ కార్యదర్శి జై షా… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనుండగా… భారత్ నుంచి ఈ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తిగా జై షా నిలిచారు.
ఇక ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా ఇప్పటికే రికార్డ్ సాధించారు. జై షా ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని ఐసీసీ ప్రకటించింది.
ఈ పదవిని చేపట్టడం గర్వంగా భావిస్తున్నట్లు జై షా తెలిపారు. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై ఫోకస్ పెడుతానని, మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని జై షా తెలిపారు.