Saturday, November 23, 2024

జ‌డేజాకి ప్ర‌మోష‌న్, రాహుల్ కి డిమోష‌న్, భ‌ర‌త్ కి చోటు..

న్యూఢిల్లి: 2022-23 సీజన్‌కు టీమిండియా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టు వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణించిన రవీంద్ర జడేజాకు ప్రమోషన్‌ లభించింది. అతనికి ఎ ప్లస్‌ కేటగిరీలో చోటుదక్కింది. కెప్టెన్‌, మాజీ కెప్టెన్‌ రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ ఎ ప్లస్‌ కేటగిరీలోనే కొనసాగనున్నారు. గతేడాది జులైలో గాయపడిన జస్ప్రీత్‌ ఋమ్రాను సైతం ఇదే కేటగిరీలో కొనసాగించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. వీరికి వార్షిక ఫీజు కింద రూ.7కోట్లు పొందుతారు. ఇక మరో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌, పేసర్‌ మహ్మద్‌ షమి, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌ ఎ గ్రేడ్‌లో ఉన్నారు. వీరికి వార్షిక ఫీజు కింద రూ.5కోట్లు లభిస్తుంది.


బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో విఫలమైన కేఎల్‌ రాహుల్‌ గ్రేడ్‌ తగ్గింది. శిఖర్‌ ధావన్‌ ఏకంగా సి గ్రేడ్‌కు వెళ్లిపోయాడు. అజింక్య రహానే, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా, దీపక్‌ చాహర్‌ తదితర ప్లేయర్లు వార్షిక కాంట్రాక్టు నుంచి తొలగించారు..
ఎ ప్లస్‌ కేటగిరీకి రూ.7 కోట్లు , ఎ క్యాట‌గిరి రూ.5 కోట్లు, బి కేటగిరీకి రూ.3కోట్లు, సి కేటగిరికి రూ.1 కోటి రూపాయల చొప్పున వార్షిక ఫీజు చెల్లిస్తారు.
ఎ ప్లస్‌: రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా
ఎ : హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌, షమి, రిషబ్‌, అక్షర్‌పటేల్‌
బి : చతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, సిరాజ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శుభ్‌మన్‌గిల్‌,
సి : ఉమేశ్‌ యాదవ్‌, శిఖర్‌ ధావన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దిప్‌ యాదవ్‌,వాషింగ్టన్‌ సుందర్‌, సంజు శాంసన్‌, అర్షదీప్‌ సింగ్‌, కేఎస్‌ భరత్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement