వరుస గాయాల కారణంగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచనలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నట్టు వచ్చిన వార్తలపై అతను స్పందించాడు. వరుస ట్వీట్లతో కెరీర్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఫేక్‌ఫ్రెండ్స్ ఎప్పుడూ రూమర్స్‌నే నమ్ముతారని, నిజమైన దోస్తులు మాత్రం వాస్తవం తెలుసుకుంటారనే కొటేషన్‌ను ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. టెస్టు జెర్సీలో ఉన్న ఫొటోనూ షేర్ చేశాడు. కెరీర్‌లో చివరి మ్యాచ్ వరకు టెస్టు క్రికెట్ వదిలేది లేదని సంకేతం ఇచ్చాడు. వరుస గాయాల కారణంగా సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించేందుకు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది.
టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలనే ఆలోచనలో జడేజా ఉన్నాడని, స్వయంగా ఈ విషయాన్ని జడేజా సన్నిహితుడు ఒకడు వివరించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో జడేజా మోకాలి గాయానికి గురయ్యాడు. దాంతో ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆడలేదు. సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. కోలుకోవడానికి 6నెలల సమయం పడుతుంది. దీంతో సఫారీలతో ఆటకు దూరమయ్యాడు. అందుకే టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్తాడనే పుకార్లు వినిపించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital