భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్ , ధ్రువ్ జురెల్ లు జాక్‌పాట్ కొట్టారు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఇరగదీసిన వీళ్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. మూడు టెస్టులు ఆడినందున ఈ ఇద్దరికీ భారత క్రికెట్ బోర్డు తాజాగా ‘సీ’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఖరారు చేసింది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ తర్వాత జురెల్, సర్ఫరాజ్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది.
సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడంతో జెరెల్, సర్ఫరాజ్‌లు ఏటా రూ. 1 కోటి రూపాయలు ఆర్జించనున్నారు. టెస్టు క్రికెట్‌పై అమితమైన ఆసక్తితో పాటు ధనాధన్ ఆడగల సత్తా ఉన్నా ఈ ఇద్దరికీ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్టు లో జురెల్, సర్ఫరాజ్‌లు అరంగేట్రం చేశారు.
ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్
తొలి మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ తన బ్యాట్ పవర్ చూపిస్తూ రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో బాదాడు. మరోవైపు జురెల్ ఏడో స్థానంలో బరిలోకి దిగి ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో 46 పరుగులతో పర్వాలేదనిపించాడు. రాంచీ టెస్టులో జురెల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. కుల్దీప్ యాదవ్‌తో కలిసి జట్టును ఆలౌట్ ప్రమాదం నుంచి బయట పడేశాడు. హాఫ్ సెంచరీ(96)తో జట్టును పోటీలో నిలిపిన జురెల్.. అనంతరం శుభ్‌మన్ గిల్(54 నాటౌట్)తో కలిసి భారత్ సిరీస్ విజయంలో భాగమయ్యాడు.