గ్రాండ్ స్లామ్ సాధించాలన్న ఆమె కలను నెలసరి అడ్డుకుంది. మ్యాచ్ మధ్యలో ఉన్నప్పుడు నెలసరి నొప్పి రావడంతో.. చివరికి రెండు సెట్స్‌లో ఓడిపోయింది. ఈ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఆలోచించేలా చేస్తున్నాయి. అబ్బాయి అయి ఉంటే బాగుండేదని.. ఇలాంటి నొప్పులు ఉండేవి కాదని చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు.. చైనాకు చెందిన 19 ఏళ్ల క్రీడాకారిణి క్వినెన్ జెంగ్. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 74వ స్థానంలో కొనసాగుతున్నది. ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్, పోలెండ్ స్టార్ ఇగా స్వైటెక్‌తో పోరాడేందుకు ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తొలి సెట్ జెంగ్ గెలిచింది. రెండో సెట్ ప్రారంభమయ్యేసరికి నొప్పి ప్రారంభమైంది. అయినా ఆడేందుకు ప్రయత్నించింది.
కానీ చివరికి ఓడిపోయింది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి జెంగ్ తప్పుకుంది. దీంతో తీవ్ర ఉద్వేగానికి లోనైన ఆమె మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తాను అబ్బాయి అయి ఉంటే కచ్చితంగా మ్యాచ్ గెలిచేదాన్ని అంటూ వ్యాఖ్యానించింది. నెలసరి తొలి రోజూ అమ్మాయిలకు ఎంతో కష్టంగా ఉంటుందని, అయినా ఆటను ఎప్పుడూ వదల్లేదని వివరించింది. రెండో సెట్ ప్రారంభంలోనే నొప్పి ఎక్కువగా రావడంతో.. ఓడిపోయానని చెప్పుకొచ్చింది. ప్రకృతికి విరుద్ధంగా ఏమీ చేయలేమని అభిప్రాయపడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..