విరాట్ కోహ్లీ వల్లే భారత జట్టు టెస్ట్ క్రికెట్‌కు వన్నె వచ్చిందని సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు. అయితే రాబోయే సంవత్సరాల్లో కేవలం ఐదు లేదా ఆరు జట్లే సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్ ఆడతాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొన్ని జట్లే టెస్టు క్రికెట్ అభివృద్దికి దోహదం చేస్తున్నాయని వ్యాఖ్యానించాడు.
కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా సుదీర్ఘ ఫార్మెట్‌కు వన్నె తెచ్చింది. ఇంకా చెప్పాలంటే టెస్ట్ క్రికెట్‌కు అతడు పతకాధికారి. కోహ్లీ ఆధ్వర్యంలో చిరస్మరణీయ విజయాలు అందుకున్న భారత్ తొలిసారి టెస్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరిందని స్మిత్ గుర్తు చేశాడు.