Friday, November 22, 2024

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌.. బంగారంతో ఖాతా తెరిచిన ఇండియా ..

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌ తన ఖాతా తెరిచింది. అజర్‌బైజాన్‌లోని బాకు వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఎలవెనిల్‌ వలరివన్‌, రమితతో పాటు శ్రేయ అగర్వాల్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మహిళల విభాగంలో బంగారు పతకాలు సాధించా రు. స్వర్ణ పతక పోటీలో.. భారత్‌కు చెందిన ఈ ముగ్గురు షూటర్లు.. 17-5తో డెన్మార్క్‌కు చెందిన అన్నా నెయిల్‌సన్‌, ఎమ్మా కోచ్‌తో పాటు రిక్కే మెయింగ్‌ ఇబ్సెన్‌ పై గెలుపొందారు. ఈ ఈవెంట్‌లో పొలాండ్‌ కాంస్య పతకంతో మెరిసింది. ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ షూటర్‌ ఎలవెనిల్‌, రమిత, శ్రేయలు సోమవారం జరిగిన రెండు రౌండ్ల క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రాణించి.. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. భారత్‌కు చెందిన ముగ్గురు షూటర్లు.. 90 షాట్స్‌లో 944.4తో క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో టాప్‌లో నిలబడ్డారు. స్టేజ్‌ రెండులో భాగంగా.. డెన్మార్క్‌తో టైటిల్‌ రౌండ్‌ కోసం పోటీ పడ్డారు.

పురుషుల ఎయిర్‌ రైఫిల్‌ కాంపిటీషన్‌లో.. ఇండియ న్‌ షూటర్లు రుద్రాంక్ష్‌ పాటిల్‌, పార్థ్‌ మఖిజా, ధనుష్‌ శ్రీకాంత్‌లు కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. వీరు క్రోషియాతో తలపడ్డారు. 10-16 తేడాతో క్రోషియా ముందంజలో నిల్చుంది. భారత్‌ నుంచి ఈ పోటీల్లో పాల్గొనేందుకు 12 మంది షూటర్స్‌ వెళ్లారు. పతకాల పట్టికలో భారత్‌ ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. రెండు బంగారు పతకాలు కలుపుకుని మొత్తం నాలుగు పతకాలతో సెర్బియా టాప్‌లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement