Tuesday, November 12, 2024

Rishabh Pant :వికెట్ల వెనుక ఐర‌న్ డోమ్…కీపింగ్ లో పంత్ అదుర్స్

ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్‌ను ఆరు వికెట్లతో చిత్తుచిత్తుగా ఓడించింది. తొలుత గుజరాత్‌ను 17.3 ఓవర్లో 89 పరుగులకు ఆలౌట్ చేసింది. ముకేశ్ కుమార్ (3/14) మూడు వికెట్లతో సత్తాచాటాడు. రషీద్ ఖాన్ (31; 24 బంతుల్లో, 2×4, 1×6) టాప్ స్కోరర్. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది.

వికెట్లు వెనుక ఐర‌న్ డోమ్..
ఇక రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఐపీఎల్‌ 2024 సీజన్‌తోనే క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్‌.. మునుపటి తరహాలో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో బ్యాట్‌తో ఇదివరకే ప్రూవ్‌ చేసుకున్న పంత్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 17) జరుగుతున్న మ్యాచ్‌లో వికెట్ల వెనుక కూడా సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచి చురుగ్గా ఉన్న పంత్‌.. రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు రెండు మెరుపు స్టంపౌట్లు చేశాడు. తొలుత ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో లెగ్‌ సైడ్‌ దిశగా డేవిడ్‌ మిల్లర్‌ ఆడిన బంతిని అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌గా మలిచిన పంత్‌.. ఆతర్వాత ట్రిస్టన్‌ స్టబ్స్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఏకంగా రెండు స్టంపౌట్లు చేసి మునుపటి పంత్‌ను గుర్తు చేశాడు.
తొమ్మిదో ఓవర్‌ మూడో బంతికి అభినవ్‌ మనోహర్‌ను వికెట్ల వెనక దొరకబుచ్చుకున్న పంత్‌.. ఆతర్వాత ఐదో బంతికి షారుఖ్‌ ఖాన్‌ను కూడా ఇదే తరహాలో స్టంపౌట్‌ చేశాడు. అనంతరం 18వ ఓవర్‌ తొలి బంతికి ముకేశ్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ క్యాచ్‌ పట్టిన పంత్‌.. ఈ మ్యాచ్‌లో మొత్తంగా నలుగురిని ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు.

- Advertisement -

గుజ‌రాత్ చెత్త రికార్డ్…

మరోవైపు గుజరాత్ టైటాన్స్ పేలవమైన రికార్డులు నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప స్కోరు (89). అంతకుముందు 2023లో ఢిల్లీపై చేసిన 125/6 స్కోరే అత్యల్పంగా ఉండేది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఓ జట్టు చేసి అత్యంత తక్కువ స్కోరు కూడా ఇదే. 2012లో ముంబై ఇండియన్స్ చేసిన 92 పరుగుల లోయెస్ట్ స్కోరు చెత్త రికార్డును గుజరాత్ ఇవాళ బ్రేక్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement