Friday, November 22, 2024

కోహ్లి సారధ్యంలో కప్‌ గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా: ఇర్ఫాన్‌ పఠాన్‌

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ” కోహ్లి నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది. టి20 ప్రపంచకప్‌ అనంతరం  ఆ ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు తెలిపాడు. అయితే ఏడాది తిరగకుండానే మరో టి20 వరల్డ్‌కప్‌ జరగనుంది. నా వర​కు కోహ్లి.. టెస్టు కెప్టెన్‌గా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటాడని భావించా. కానీ ఇలా నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు. ఒక టి 20 కెప్టెన్‌గా కోహ్లికిది చివరి ప్రపంచకప్‌.. కాబట్టి టీమిండియా అతని సారధ్యంలో కప్‌ గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఐదేళ్ల పాటు టి20 కెప్టెన్‌గా భారత్‌కు విజయాలు అందించాడు. ఒక కెప్టెన్‌గానే గాక ఒక బ్యాట్స్‌మన్‌గా ఎన్నో సంచలనాలు సృష్టించిన కోహ్లి పొట్టి ఫార్మాట్‌ నుంచి కెప్టెన్‌గా పక్కకు తప్పుకోవడం బాధ కలిగించింది. అయితే కోహ్లి తాను కెప్టెన్సీ నుంచి తప్పుకునే ముందు రవిశాస్త్రి, రోహిత్‌లతో సుధీర్ఘ చర్చల అనంతరమే నిర్ణయం తీసుకున్నట్లు అనిపించింది. కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా రానున్న రోహిత్‌ శర్మను తక్కువ చేసి చూడలేం. అతని కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్‌ నాలుగుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకుంది. కోహ్లి గైర్హాజరీలోనూ రోహిత్‌ టీమిండియాకు మంచి విజయాలు అందించాడు.” అని చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి: ఒత్తిడిని జయిస్తే కప్ ఆర్సీబీదే: గంభీర్

Advertisement

తాజా వార్తలు

Advertisement