Tuesday, November 26, 2024

ఐర్లాండ్‌-న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌.. కివీస్‌ ఘనవిజయం

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో పర్యాటక న్యూజిలాండ్‌ జట్టు శుభారంభం చేసింది. తొెలి టీ20 మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో న్యూజిలాండ్‌ ఆధిక్యంలో నిలిచింది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే… టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ బౌలింగ్‌ ఎంచుకోగా, న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ 69 పరుగులతో అజేయంగా నిలవగా, నీషమ్‌ (29), గప్టిల్‌ (24), బ్రాస్‌వెల్‌ (21) పరుగులతో రాణించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో జోష్‌ లిటిల్‌ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్‌ అడేర్‌ 2 వికెట్లు తీశాడు. ఇక 174 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ బ్యాటర్లలో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌, కెప్టెన్‌ అండ్రూ బల్బిర్నీ వరుసగా 13, 12 పరుగులు చేసి అవుటయ్యారు.

ఇక డెలనీ 5 పరుగులే చేయగా, హిట్టర్‌ హ్యారీ టెక్టర్‌ సైతం ఐదు పరుగులకే నిష్క్రమించాడు. ఈ క్రమంలో కర్టిస్‌ కాంఫర్‌ 29 పరుగులతో రాణించి ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఎనిమిదో స్థానంలో మార్క్‌ అడేర్‌ 25 పరుగులు చేయగా, మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో 31 పరుగుల తేడాతో బల్బిర్నీ బృందం కివీస్‌ చేతిలో ఓటమిపాలైంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌కు అత్యధికంగా 4 వికెట్లు దక్కగా, జేమ్స్‌ నీషమ్‌ 2, కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. డఫ్పీ, ఇష్‌ సోధి చెరో వికెట్‌ తీశారు. ఇక కివీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన గ్లెన్‌ఫిలిప్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement