Friday, November 22, 2024

కార్తీక్‌కు ఐపీఎల్‌ వార్నింగ్‌.. రూల్స్ ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే కార‌ణం..

లక్నో సూపర్‌ జెయింట్స్‌ వర్సెస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఆర్‌సీబీ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ను ఐపీఎల్‌ నిర్వాహకులు మందలించారు. అందుకు తగ్గ చర్యలను ఐపీఎల్‌ నిర్వాహక యాజమాన్యం చేపట్టింది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో బుధవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో దినేష్‌ కార్తీక్‌.. ఐపీఎల్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించాడని, అందుకే అతన్ని మందలిస్తున్నట్టు ఐపీఎల్‌ ప్రకటించింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2, 3 కింద లెవల్‌ 1 నేరాన్ని అతనిపై మోపింది. దాన్ని కార్తీక్‌ అంగీకరించాడని పేర్కొంది. మ్యాచ్‌ నిషేధం, భారీ జరిమానాలు మాత్రం విధించలేదు. అయితే మందలించడానికి కారణాలు వెల్లడించలేదు. కార్తీక్‌ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కాస్త అగ్రెస్సివ్‌ ధోరణిలో ప్రవర్తించాడు. షాట్స్‌ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన దినేష్‌.. గట్టిగట్టిగా అరిచాడు. బ్యాట్‌ను చేత్తో కొడుతూ తీవ్రంగా తనపై తానే ఆగ్రహం వ్యక్తం చేసుకున్నాడు. దీంతో సెల్ఫ్‌ టోలరెన్స్‌ కింద అతనిపై ఐపీఎల్‌ మందలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement