Tuesday, November 19, 2024

ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి..

కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్‌ 2021లో మిగిలిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్‌–అక్టోబర్‌ మధ్య యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ నేపథ్యంలో గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీని ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించారు. ప్రస్తుతం యూఏఈ, అబుదాబి, షార్జాలో కరోనా అదుపులోనే ఉండటంతో మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. సెకండాఫ్‌ టోర్నీకి స్టేడియం సామర్థ్యంలో ప్రతీ మ్యాచ్‌కు 50శాతం మంది ప్రేక్షకుల్ని అనుమతించాలని ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ఆలోచిస్తోంది. ఐపీఎల్‌ రెండోదశ నిర్వహణ, ప్రేక్షకులను అనుమతించే విషయంపై బీసీసీఐ ఉన్నతాధికారుల బృందం ఈసీబీ అధికారులను వచ్చే బుధవారం కలవనుంది. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం వరకు టీకాలు వేసుకున్న ప్రేక్షకులను మ్యాచ్‌లను వీక్షించేందుకు అనుమతించవచ్చని ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement