రాజస్థాన్ రాయల్స్‌ను పంజాబ్ బౌలర్లు బాగానే కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు తీయకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో వరుసగా వికెట్లను కూడా పడగొట్టారు. మధ్యలో రియాన్ పరాగ్ (48) ఒక్కడు పంజాబ్ ధాటిని తట్టుకుని నిలకడగా ఆడినప్పటికీ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసేలోపే ఔటయ్యాడు. అయినప్పటికీ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement