Friday, November 22, 2024

డిసెంబర్‌ 23న ఐపీఎల్‌ మినీ వేలం.. కొచ్చిలో ఆక్ష‌న్ కోసం ఏర్పాట్లు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మినీ వేలం డిసెంబర్‌ 23న జరుగనుంది. ఈ సారి కేరళలోని కొచ్చిలో వేలం నిర్వహిస్తున్నారు. మొత్తం 10 టీమ్‌లు ఈ వేలంలో పాల్గొననున్నాయి. గత మెగా వేలంలో ఈ టీమ్‌లకు వచ్చిన రూ 90 కోట్లను ఈ సారి ఆటగాళ్ల కొనుగోలుకు ఖర్చు చేయనున్నాయి. పంజాబ్‌ అత్యధికంగా రూ 8.45 కోట్ల పర్స్‌ కలిగి ఉన్నది. వీటితో పాటు గత ఐపిఎల్‌లో తొలిసారిగా చేరిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ పర్స్‌ మొత్తాన్ని ఖర్చు చేసింది. వారి దగ్గర కేవలం రూ 5 కోట్లు మాత్రమే ఉన్నాయి.

మొత్తం 10 ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు నవంబర్‌ 15 నాటికి రి టైన్‌ చేసే ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. రిటైన్‌ చేసేందుకు రవీంద్ర జడేజా పేరును చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే శార్దూర్‌ ఠాకూర్‌తో పాటు నలుగురు ఆటగాళ్లు వేలానికి వదిలేసేందుకు ఢిల్లిd క్యాపిటల్స్‌ జట్టు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement